మాళవిక నాయర్ కి నందిని రెడ్డి ఆఫర్

Malavika-Nair
మన తెలుగు చిత్ర సీమలో లేడీ డైరెక్టర్స్ ఎంత మంది ఉన్నారు అంటే వేళ్ళ మీద లెక్కబెట్టి చెప్పచ్చు. ఈ మధ్య కాలంలో ఇప్పటి తరానికి తగ్గట్టుగా సినిమాలు చేస్తున్న లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి. ‘అలా మొదలైంది’తో సూపర్ హిట్ అందుకున్న నందిని రెడ్డి ఆ తర్వాత ‘జబర్దస్త్’తో హిట్ అందుకోలేకపోయింది. కానీ గత కొద్ది రోజులుగా ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించనున్నాడు.

గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. సుమారు 400 మందిని చూసాక నందిని రెడ్డి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో హీరోగా పరిచయం అయిన ఢిల్లీ భామ మాళవిక నాయర్ ని ఎంపిక చేసింది. ‘మొదటి సారి ఎవడే సుబ్రహ్మణ్యం ఆడియోలో మాళవిక నాయర్ ని చూసాను. చోడగానే తనలో ఒక స్పెషాలిటీ కనిపించింది. అలాగే తన ఫేస్ మరియు కళ్ళు ఊహించుకోగానే నేను రాసుకున్న పాత్రకి తనే కరెక్ట్ అనిపించిందని’ నందిని రెడ్డి తెలిపింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఈ భామకి తెలుగులోమరికొన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Exit mobile version