‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి సరికొత్త డ్యాన్స్ నంబర్ ‘యెషనాగుల’ (#Yeshanagula) విడుదలైంది.
అనిరుధ్ మ్యూజిక్.. నాని-కీర్తి సురేష్ డ్యాన్స్ మేనియా
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పూర్తిస్థాయి హై-ఎనర్జీ బీట్స్‌తో, పవర్‌ఫుల్ రిథమ్‌తో ఈ పాట అదిరిపోయింది. లోకల్ ఫోక్ టచ్‌తో కూడిన లిరిక్స్‌ను కాసర్ల శ్యామ్ అందించగా, ప్రభా బంగారిగళ్ళ, అద్దుల జంగిరెడ్డి తమ గాత్రంతో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. ఈ పాటలో నాని రగ్గడ్ లుక్‌లో కనిపించగా, కీర్తి సురేష్‌తో కలిసి వేసిన మాస్ స్టెప్పులు విజువల్‌గా ఆకట్టుకుంటున్నాయి. లోకేష్ ఆనంద్ అందించిన షెహనాయ్ బిట్ పాటకు మరింత ఊపు తీసుకొచ్చింది.
ఈ చిత్రానికి సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. మాస్ మరియు రస్టిక్ వైబ్స్‌తో విడుదలైన ఈ ‘యెషనాగుల’ పాట ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


