
ఈ ఏడాది జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో నాని వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నాడు. మొదటి ఇప్పటికే మారుతి డైరెక్షన్ లో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా పూర్తి చేసిన నాని తన తదుపరి సినిమా అందాల రాక్షసి ఫేం హను రాఘవాపూడి డైరెక్షన్ లో చేయనున్న సంగతి మీకు తెలిసిందే. మారుతి సినిమా పూర్తి చెఇస్న నాని జూలై చివర్లో అనంతపూర్ చేరుకొని హను మూవీ సెట్లో జాయిన్ అయ్యాడు. సుమారు 10 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ నిన్నటితో ముగిసింది. ఈ షెడ్యూల్ లో ఉరవకొండ ప్రాంతంలో ఒక పాటతో పాటు కొన్ని ముఖ్య సన్నివేశాలను షూట్ చేసారు. అనంతపూర్ షెడ్యూల్ పూర్తవడంతో ఈ చిత్ర టీం హైదరాబాద్ చేరుకుంది.
ఓ షార్ట్ గ్యాప్ తర్వాత న్యూ షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టనుంది. నాని ఈ సినిమాలో అనంతపూర్ కి చెందిన నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపించనున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాకి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారు. 14 రీలే ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాని తదుపరి సినిమా ‘భలే భలే మగాడివోయ్’ ఆడియోని ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నారు. సినిమాని కూడా ఆగష్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదట్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటె నాని ఇంద్రగంటి మోహన కృష్ణ మరియు వంశీధర్ అనే దర్శకుల డైరక్షన్ లో సినిమాలు చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.