ఆ యంగ్ హీరోకి నాని సాయం !

nani3

నేచుల‌ర్ స్టార్ నాని ఇప్ప‌టికే ప‌లు చిత్రాల‌కు తన వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు యంగ్ హీరో రాహుల్ విజ‌య్ న‌టించిన ‘ఈ మాయ పేరేమిటో’ అనే చిత్రానికి కూడా వాయిస్ అందించనున్నారు. పెద్ద పెద్ద స్టార్స్‌ కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కంపోజ్ చేశారు ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్. ఆయన కుమారుడే రాహుల్ విజ‌య్‌. ప్రస్తుతం రాహుల్ హీరోగా పరిచయమవుతున్నారు.

కాగా రాహుల్ సరసన కావ్యా థాప‌ర్ హీరోయిన్ గా నటిస్తోంది. వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొత్త దర్శకుడు రాము కొప్పుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి దివ్య విజయ్‌ నిర్మాతగా ఉన్నారు.

Exit mobile version