ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా పలు ఆసక్తికర ప్రాజెక్టులలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాంటి వాటిలో టాలెంటెడ్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో టేకప్ చేసిన రెండో ప్రాజెక్ట్ “టక్ జగదీష్”. మొదటి నుంచీ మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే కొన్ని రోజుల కితమే ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసారు. దానితో పాటుగా ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేస్తామని తెలిపారు. మరి అలా అన్నట్టే ఇప్పుడు పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ ను చూస్తే మాత్రం ఓ క్లాస్ అండ్ పవర్ ప్యాక్డ్ గా ఉందని చెప్పాలి.
టక్ లుక్ లో భోజనం ముందు కూర్చొని వెనక నుంచి కత్తి తీస్తూ నాని సింపుల్ గా ఊర మాస్ అనిపించాడు. దీనితో ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయం అని ఆడియెన్స్ కు కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది వేసవి రేస్ లో విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. అలాగే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సన్ షైన్ స్క్రీన్స్ నిర్మాణం వహిస్తున్నారు.
