ఆయా షేర్ తో నాని ఊచకోత.. మార్కెట్ లోకి కొత్త డ్రగ్ దింపిన అనిరుద్!

The Paradise 1

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ది ప్యారడైజ్”. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమాపై ఉన్న అంచనాలు కూడా అన్నీ ఇన్ని కావు. ఇక ఈ సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ ఎట్టకేలకి కొంత ఆలస్యం తర్వాతే రిలీజ్ చేశారు.

నిజానికి ఇంత లేట్ అంటే మన తెలుగు ఆడియెన్స్ లో ఖచ్చితంగా చాలా అసహనం చూపించేవారు. కానీ ఈ సాంగ్ కి మాత్రం లేట్ అయినా కూడా రెట్టింపు ఉత్సాహం కనబరిచారు. ఇక అదే ఊపులో రిలీజ్ కి వచ్చిన ఈ సాంగ్ మాత్రం ఇన్స్టంట్ బ్లాక్ బస్టర్ డ్రగ్ అని చెప్పాల్సిందే.

ముఖ్యంగా అనిరుద్ మ్యాజిక్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు అంచనాలు ఏమాత్రం తగ్గకుండా మ్యూజిక్ ఉంటే విజువల్ గా కూడా ఈ లిరికల్ సాంగ్ షాకింగ్ గా డిజైన్ చేశారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. పదునైన సాహిత్యంతో నాని కింగ్డమ్ కోసం తన యాటిట్యూడ్ ని పరిచయం చేస్తూ వచ్చిన ఈ సాంగ్ ఇన్స్టంట్ గూస్ బంప్స్ ని అందిస్తుంది.

ఇక ఇదంతా సాంగ్ కోసం అయితే ఈ సాంగ్ లో నాని పెర్ఫామెన్స్ కి ఊచకోత అనే పదం కూడా చిన్నదే అవుతుంది అనొచ్చు. తన స్వాగ్, జడల్ గా ఆ యాటిట్యూడ్ ఊహాతీతంగా కనిపిస్తున్నాయి. పైగా ఆ ఫ్లోర్ మూమెంట్ లో పొగ త్రాగుతూ స్టెప్ అయితే ఇన్స్టా రీల్స్ ని రూల్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఖచ్చితంగా ప్యారడైజ్ మీద ఉన్న అంచనాలు మరింత స్థాయిలోకి ఈ ఒక్క సాంగ్ తీసుకెళ్ళిపోయింది అంతే.. ఇదే కంటెంట్ ని కానీ మేకర్స్ మైంటైన్ చేస్తే మాత్రం ప్యారడైజ్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఊహించని నెంబర్స్ నే సెట్ చేస్తుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version