శంషాబాద్ లో నాని ‘భలే భలే మగాడివోయ్’

Nani1
యంగ్ హీరో నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ షూటింగ్ ఫినిష్ చేసాడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండగానే తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. ఈ రోజుల్లో, బస్ స్టాప్, కొత్త జంట చిత్రాల దర్శకుడు మారుతి డైరెక్షన్ లో చేయనున్న సినిమా ఇటీవలే లాంచనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘భలే భలేమగాడివోయ్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. మార్చి 2న ఈ మూవీని లాంచ్ చేయడంతో పాటే రెగ్యులర్ షూటింగ్ ని కూడా మొదలు పెట్టేసారు.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను సిటీ అవుట్ స్కర్ట్స్ అయిన శంషాబాద్ లో షూట్ చేస్తున్నారు. అక్కడ హైవేకి దగ్గరలో కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. యూత్ ఫుల్‌ లవ్ & కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో ‘అందాల రాక్షసి’ ఫేం లావణ్య త్రిపాఠి నానితో రొమాన్స్ చేయనుంది. లావణ్య త్రిపాఠి మోడరన్ సిటీ గర్ల్ పాత్రలో కనిపించనున్న ఈ మూవీని గీత ఆర్ట్స్ సంస్థ – యువి క్రియేషన్స్ వారు కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. ‘కొత్త జంట’ తర్వాత కాస్ట్ గ్యాప్ తీసుకున్న మారుతి ఈ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకోవాలని పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ని రెడీ చేసాడని సమాచారం.

Exit mobile version