అడ్వాన్స్ సేల్స్ తోనే దుమ్ము రేపుతున్న ‘ది ప్యారడైజ్’!

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సెన్సేషనల్ చిత్రమే ‘ది ప్యారడైజ్’. యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రానుంది. అయితే ఈ సినిమాతో నాని కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లోనే అడ్వాన్స్ సేల్స్ లో భారీ నెంబర్స్ ని ది ప్యారడైజ్ నమోదు చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఆల్రెడీ ఒక్క నార్త్ అమెరికా నుంచే 10 కోట్ల మేర గ్రాస్ ని రాబట్టేసిన ఈ సినిమా ఓవరాల్ గా కలిపి ఇప్పుడు కేవలం అడ్వాన్స్ సేల్స్ తోనే 50 కోట్ల మేర గ్రాస్ ని రాబట్టేసినట్టు తెలుస్తుంది. ఇది మాత్రం మామూలు మాస్ కాదని చెప్పాలి. ఒక ఓవరాల్ గా మొదటి రోజు నాని కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా భారీ ఓపెనర్లు లో ఒకటిగా ప్యారడైజ్ నిలిచే అవకాశం బలంగా ఉందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహించారు.

Exit mobile version