
దాదాపు మూడేళ్ళ తర్వాత యంగ్ హీరో నాని ‘ఎవడే సుబ్రమణ్యం’ రూపంలో హిట్ అందుకొని కాస్త ఊపిరి పీల్చుకుంటే, రీసెంట్ గా వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా ఇచ్చిన విజయం నానిని మరో లీగ్ లోకి తీసుకెళ్ళింది. బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా నమోదు చేసిన విజయం నానిలో ఓ నూతన ఉత్తేజాన్ని నింపింది. దీంతో నాని తన తదుపరి సినిమాల జోరును మరింత పెంచాడు. ప్రస్తుతం నాని హను రాఘవాపూరి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కాకుండా తనని హీరోగా పరిచయం చేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇది వరకే తెలియజేశాం.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఇప్పటికే నాని సరసన బ్యూటిఫుల్ సురభిని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసారు. తాజాగా ఈ సినిమాలో ననికి జోడీగా మరో హీరోయిన్ ని కూడా ఎంపిక చేసారు. మలయాళ భామ నివేద థామస్ ని సెకండ్ హీరోయిన్ గా ఓకే చేసారు. నివేద ఇటీవలే కమల్ హాసన్ నటించిన పాపనాశం సినిమాలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఇది కాకుండా నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ‘జూలియట్ – లవ్ అఫ్ ఇడియట్’ లో కూడా నివేద హీరోయిన్ గా నటిస్తోంది. నాని – ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.