విజయ్ సేతుపతి ,త్రిష జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తమిళ భాషలో రూపొందిన చిత్రం ’96’. ఈచిత్రం రేపు విడుదలకానుండగా తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, విజయ్ సేతుపతి తో కలిసి సహజ నటుడు నాని ఈ చిత్రాన్ని వీక్షించారు. చిత్రం ఆయనకు బాగా నచ్చిందని సమాచారం.
ఇక ఈచిత్రం యొక్క తెలుగు రీమేక్ రైట్స్ ను దిల్ రాజు దక్కించుకున్నారు అని తెలిసిందే. ఇప్పుడు తాజాగా నాని ఈచిత్రం చూడడంతో ఆయన ఈచిత్రంలో నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈవిషయం ఫై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక 96 చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుంది. తాజాగా ఈచిత్రాన్ని చూసిన తమిళ సినీ విశ్లేషకులు ఈచిత్రం ప్యూర్ లవ్ ఎంటర్టైనర్ గా చాలా బాగుందని అంటున్నారు.
