చివరి దశకు చేరుకున్న నాని ‘ఎవడే సుబ్రమణ్యం’

Nani1
యంగ్ హీరో నాని ప్రస్తుతం వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, కొన్ని సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తూ బిజీబిజీగా ఉన్నాడు. చాలా రోజుల క్రితమే నాని షూటింగ్ మొదలు పెట్టిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా అప్పుడే చివరి దశకు చేరుకుంది. ఇటీవలే మౌంట్ ఎవరెస్ట్ శెస్యోల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ఫైనల్ షెడ్యూల్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తన లైఫ్ గురించి తెలుసుకోవడానికి ఓ కుర్రాడు మొదలు పెట్టె జర్నీలో తనకు ఎదురైన అనుభవాలు తనని ఎలా మార్చాయి అనేదే ఈ సినిమా కథాంశం.

శేఖర్ కమ్ముల దగ్గర పనిచేసిన నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని సరసన ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘నా రాకుమారుడు’ ఫేం రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మాళవిక నాయర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో కొంత భాగాన్ని నేపాల్ లో కూడా షూట్ చేస్తున్నారు. గతంలో ‘స్టూడెంట్ నెం.1’ లాంతో సూపర్ హిట్ మూవీని అందించిన స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్న – ప్రియాంక దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి 2015 మొదట్లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version