న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ‘దసరా’. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ‘ది ప్యారడైజ్’ అనే మూవీ రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది, చిత్ర బృందం సినిమాను పూర్తి చేసేందుకు రేయింబవళ్లు శ్రమిస్తోంది. ఈ సినిమా నుంచి ఒక అద్భుతమైన టీజర్ త్వరలోనే రాబోతోందని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. పైగా ఈ టీజర్ లో ఈ సినిమా కొత్త విడుదల తేదీని కూడా రివీల్ చేయనున్నారు.
కాగా ఈ చిత్రంలో ప్రతినాయకుడైన ‘షికంజా మాలిక్’ పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు. అన్నట్టు ‘ప్యారడైజ్’ సినిమాలో నాని క్యారెక్టర్, డైలాగులు చాలా బోల్డ్‌గా, ఊరమాస్‌గా ఉండబోతున్నాయట. ఈ సినిమాలో రాఘవ్ జుయాల్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, బాబు మోహన్ మరియు సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ స్థాయిలో ఈ పాన్-ఇండియా చిత్రం రూపొందుతోంది.
