‘గజదొంగ బయోపిక్’ లో నాని !

తెలుగు సినీపరిశ్రమలో ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ‘మహానటి సావిత్రి’ బయోపిక్ వచ్చి అఖండ విజయం సొంతం చేసుకుంది. అలాగే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘మహానటుడు ఎన్టీఆర్’, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’, ముమ్మూటి నటిస్తున్న ‘దివంగనేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి’ ఇలా ఇప్పుడు వరుసగా తెలుగులో బయోపిక్ లు రానున్నాయి. తాజాగా ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ కూడా రానుంది.

‘టైగర్ నాగేశ్వర్ రావు’ పేరు ఇప్పటి తరంవారికి పెద్దగా తెలియకపోవొచ్చు. కానీ గతంలో స్టూవర్టుపురం గజదొంగగా భయానక వాతావరణాన్ని సృష్టించిన వ్యక్తి టైగర్ నాగేశ్వర్ రావు. ఈయన చరిత్రను తెరకెక్కించబోతున్నారు. స్క్రిప్ట్ కూడా పూర్తయింది. మొదట ఈ బయోపిక్ లో రానా నటిస్తారనుకున్నారు. కానీ కొన్నిఅనివార్య కారణాల వల్ల రానా ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. దాంతో ఈ స్క్రిప్ట్ నాచ్యురల్ స్టార్ నాని దగ్గరకి వెళ్ళింది. ఆయనకు కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాశారు.

Exit mobile version