నారా రోహిత్ యువహీరోలలో కాస్త భిన్నంగా సినిమాలు తీస్తాడని ప్రతీతి. తన సినిమా వస్తున్న ప్రతీసారి తనదైన శైలిలో మెప్పిస్తున్నాడు. నిన్న ‘అసుర’ సినిమాతో మరోసారి పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో మనల్ని పలకరించాడు.
విడుదలైన నాటినుండి మంచి స్పందనను అందుకుంటూ అద్భుతమైన బిజినెస్ చేస్తుంది. ఈ విజయంతో నారా రోహిత్ చాలా సంతోషంగా వున్నట్టు సమాచారం. రౌడీ ఫెలో నిరాశపరిచిన తరుణంలో ఈ విజయం రోహిత్ కి ఊరటనిచ్చిందని తెలుస్తుంది. కధనంలో తన మార్కు ప్రతిభ చూపించడంతో దర్శకుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు.
అసుర సినిమా లో ప్రియా బెనర్జీ హీరోయిన్ గా నటించింది. కృష్ణ విజయ్ దర్శకుడు. శ్యామ్ దైవభాక్తుని నిర్మాత.
