నారా రోహిత్-కుమార్ నాగేంద్ర మూవీ టాకీపార్ట్ పూర్తి

nara-rohit

విలక్షణ సినిమాలతో తెలుగులో తనదైన బాణీని సెట్ చేసుకున్న హీరో నారా రోహిత్, ఈ ఏడాది ‘అసుర’ అందించిన విజయంతో వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీబిజీగా మారిపోయారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘సావిత్రి’, ‘పండగల వచ్చాడు’ ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతోన్న రోహిత్, కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ సినిమా టాకీపార్ట్‌ను పూర్తి చేశారు. తమిళంలో మంచి విజయం సాధించిన మాన్ కరాటే సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

శ్రీ కీర్తి ఫిలిమ్స్‌పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నారా రోహిత్ ఓ సరికొత్త లుక్‌లో కనిపించి ఆకట్టుకోనున్నారు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ అందించిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో జిల్ సినిమా ద్వారా పరిచయమైన కబీర్ సింగ్ విలన్‌గా నటిస్తోండగా, లతా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తైన సందర్భంగా నిర్మాతలు సినిమా ఔట్‌పుట్‌పై నమ్మకం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆడియో రిలీజ్ జరపనున్నట్లు స్పష్టం చేశారు.

Exit mobile version