సాలిడ్ బీట్స్ తో ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా ‘ఆదర్శ కుటుంబం’ నుంచి నారాయణమ్మ.!

ఎనర్జిటిక్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే ఆదర్శ కుటుంబం. ఫామిలీ ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి అవైటెడ్ ఫస్ట్ సింగిల్ నారాయణమ్మ ను ఎట్టకేలకు కొంత ఆలస్యం తర్వాత రివీల్ చేశారు.

అయితే మొదటి నుంచీ హైప్ ఇస్తున్నట్టు గానే ఈ ఫుల్ సాంగ్ ఒక సాలిడ్ చార్ట్ బస్టర్ అని చెప్పొచ్చు. సంగీత దర్శకుడు థమన్ మరోసారి త్రివిక్రమ్ టేస్ట్ కి తగ్గట్టుగా సాలిడ్ వర్క్ ని డెలివరీ చేశారు. రామజోగయ్య శాస్త్రి సంగీతం, ఫీమేల్ వోకల్స్ పర్ఫెక్ట్ గా ఈ సాంగ్ కి సెట్ అయ్యాయి. ఇక విజువల్ గా కూడా సాంగ్ హీరోయిన్స్ శ్రీనిధి, డింపుల్ అలాగే నివేతా లు ఇందులో మంచి డాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు.

ఇక తర్వాత వెంకీ మామ ఎంట్రీ ఇచ్చి మరింత ఎనర్జీ ఈ సాంగ్ కి యాడ్ చేశారు. సో మొత్తానికి కొంచెం లేట్ చేసినా ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ని డెలివరీ చేసారు. ఇక ఈ సినిమాకి హారిక హాసిని వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

Exit mobile version