విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా 2026 అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. ఐతే, ఈ చిత్రంలోని ఏందయ్యా సామీ అనే మొదటి పాట ఇప్పటికే భారీ విజయాన్ని సాధించింది. ఈ పాజిటివ్ స్పందనతో ఉత్సాహంగా ఉన్న చిత్ర బృందం, రేపు ఒక డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
కాగా నాలుగు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మరియు రాహుల్ సంకృత్యాన్ కనిపించి, తమ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన మరియు ఇంతకు ముందెన్నడూ సినిమాకు సంబంధించి తెలియని విషయాలను పంచుకోనున్నారు. ఈ సిరీస్ ఏ ప్లాట్ ఫామ్ లో, ఏ సమయంలో మరియు ఏ భాషల్లో విడుదలవుతుందనే వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించగా, ఈ సినిమాకి అజయ్, అతుల్ లు సంగీతం అందిస్తున్నారు. టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై గుల్షన్ కుమార్ మరియు భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
