అమెరికాలో మొదలైన ఐస్ బకెట్ చాలెంజ్ ఎంత ఫేమస్ అయ్యిందో మేము ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత దీన్ని స్పూర్తిగా తీసుకొని ఇండియాలో నిర్వహించిన రైస్ బకెట్ చాలెంజ్ కూడా బాగా ఫేమస్ అయ్యింది. తాజాగా ఇండియా ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గాంధీ జయంతి రోజున గాంధీ కోరుకున్న క్లీన్ ఇండియా కోసం స్వచ్ భారత్ అభియాన్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అయిన అమీర్ ఖాన్ కూడా హాజరయ్యాడు.
మోడీ స్వచ్చందంగా చీపుర పట్టుకొని రోడ్స్ క్లీన్ చేసాడు. అలాగే ఈ చాలెంజ్ ని పలువురు చెయ్యాలని ఉద్దేశించి ఆయన కింగ్ ఖాన్ సల్మాన్ ఖాన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మరియు ప్రియాంక చోప్రాలకి స్వచ్ భారత్ అభియాన్ చెయ్యాలని చాలెంజ్ విసిరారు. వారు ఈ చాలెంజ్ చెయ్యడమే కాకుండా మరో 9 మందికి స్వచ్ భారత్ మిషన్ గురించి అవగాహన కల్పించాలని సూచించారు. మరి ఈ స్టార్స్ అంతా స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ స్వచ్ భరత్ అభియాన్ ని సక్సెస్ చేస్తారేమో చూద్దాం..
