నవీన్ పొలిశెట్టి సైలెంట్.. నెక్స్ట్ మూవీపై అప్డేట్ ఎప్పుడు..?

Naveen Polishetty

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. కథల ఎంపికలో చాలా సమయం తీసుకునే నవీన్, ఈసారి కూడా ఒక కొత్త డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే ఆ డైరెక్టర్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడట. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా విషయంలో నవీన్ పొలిశెట్టి టీమ్‌కు మైత్రీ మూవీ మేకర్స్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. నవీన్ ఈ చిత్రానికి రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో కూడా వాటా తీసుకోబోతున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ మరియు ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసి, అధికారిక ప్రకటన విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి ఈసారి నవీన్ పొలిశెట్టి ఎలాంటి కథతో రాబోతున్నాడో చూడాలి.

Exit mobile version