
తన కెరీర్లో రెండు సార్లు బ్రేక్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చిన అందాల భామ నయనతార తన సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోయిన్స్ కన్నా ఎక్కువగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ఈ భామ తెలుగులో తక్కువగా చేస్తున్నా తమిళంలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ వరుసగా విజయాలు అందుకుంటోంది. నయనతార సూర్య సరసన నటించిన ‘మాస్’ సినిమా విడుదలకి సిద్దమవుతోంది. ఈ సినిమా కాకుండా తమిళ హీరో జీవ సరసన ఓ సినిమా చేయడానికి నయనతార సైన్ చేసింది.
ఇక్కడ విషయం ఏమిటంటే ఈ చిత్ర డైరెక్టర్ సంపత్ నయనతార పాత్ర గురించి మాట్లాడుతూ ‘నయనతార కోసం ఓ స్పెషల్ ప్రీకేజీ టీచర్ పాత్రని డిజైన్ చేసాము. నయనతార చాలా కొత్తగా ఉంటుంది. జీవ ఈ సినిమాలో ఓ రొఉదె పాత్రలో కనిపిస్తాడు. కానీ వీరిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని’ అన్నాడు. ఈ సినిమా కోసం కుంభకోణంలో భారీ సెట్ ని వేస్తున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.