ప్రియుడితో న్యూయార్క్ లో బర్త్ డే చేసుకోనున్న స్టార్ హీరోయిన్.

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార రేపు జన్మదినం జరుపుకోనున్నారు. 1984 నవంబర్ 18న జన్మించిన నయనతార రేపు 35వ వసంతంలోకి అడుగిడనున్నారు. ఐతే ఈ పుట్టినరోజు వేడుకలను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి నయనతార న్యూయార్క్ సిటీ వెళ్లారు. ఇప్పటికే అమెరికా చేరిన ఈ జంట బర్త్ డే సెలెబ్రేషన్స్ కొరకు షాపింగ్ చేయడమే కాకుండా న్యూయార్క్ వీధులలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారట.

ఇక ఈ ఏడాది నయనతార రెండు భారీ చిత్రాలలో నటించారు. వాటిలో ఒకటి మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి కాగా మరొకటి విజయ్ హీరోగా వచ్చిన బిగిల్. ఈ రెండు చిత్రాల బడ్జెట్ దాదాపు 450కోట్లు కావడం గమనార్హం. నయనతార సూపర్ స్టార్ రజిని సరసన నటించిన మరో భారీ చిత్రం దర్బార్ సంక్రాంతికి విడుదల కానుంది. సౌత్ లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా నయనతార నిలిచింది. ఒక స్థాయి హీరోలకు మించి ఆమె పారితోషికం ఉండటం గమనార్హం.

Exit mobile version