మూవీ చూస్తూ కంటతడి పెటుకున్న నయనతార

Nayanthara
సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార స్వతహాగా వెరీ ఎమోషనల్ పర్సన్.. చాలా చిన్న విషయాలకు కూడా బాగా ఎమోషనల్ గా ఫీలయ్యే నయనతార తాజాగా తమిళ సినిమా ‘అమర కావ్యం’ చూస్తూ బాగా ఎమోషనల్ ఫీలయ్యింది.

తమిళ హీరో ఆర్య తన ప్రొడక్షన్ లో నిర్మించిన ‘అమర కావ్యం’ సినిమాని తన సన్నిహితులకు స్పెషల్ షో వేసాడు. ఆ సన్నిహితుల్లో నయనతార కూడా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత నయనతార అలానే కూర్చుండి పోవడమే కాకుండా, చాలా సేపు ఎమోషనల్ గా ఫీలయ్యి కంటతడి పెట్టుకున్నారు. అంతే కాకుండా సినిమా ఆమెకి బాగా కనెక్ట్ అవ్వడంతో సినిమాని తెగ పొగిడేశారు. జీవ శంకర్ డైరెక్ట్ చేసిన అమర కావ్యం సినిమాలో ఆర్య తమూదు సత్య హీరోగా నటించాడు.

Exit mobile version