నయనతార భయపెట్టడం గ్యారెంటీ – ‘మాయ’ నిర్మాత

nayanathara
ప్రముఖ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో రూపొందుతున్న తమిళ హారర్ థ్రిల్లర్ సినిమా ‘మాయ’. నయనతార టైటిల్ రోల్ పోషిస్తుంది. ఈ సినిమా కంప్లీట్ షూటింగ్ సోమవారంతో పూర్తయిందని నిర్మాత ప్రభు సోషల్ మీడియాలో తెలిపారు.

‘లాస్ట్ డే షూట్ అఫ్ ‘మాయ’.. గ్రేట్ వర్క్ బై ది టీం. నయనతార భయపెట్టడం గ్యారెంటీ. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. ‘ అని సోషల్ మీడియాలో ప్రభు తెలిపారు.

అశ్విన్ శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఆరి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ‘అనామిక’ తర్వాత నయనతార నటిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది. పోటెన్షియల్ స్టూడియోస్ పతాకంపై ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాపై తమిళ ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి.

Exit mobile version