NBK 111: మోస్ట్ హైప్డ్ వీడియోస్ లో బాలయ్య ట్రీట్ కి మాస్ రెస్పాన్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు తన కెరీర్ 111వ సినిమాని తన బ్లాక్ బస్టర్ హిట్ దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఓ హిస్టారికల్ డ్రామాగా మొదలై ఇప్పుడు ఓ భారీ గ్యాంగ్ స్టర్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ముంబైలో షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గానే బాలయ్య పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ కి ఫ్యాన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇదే వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో మోస్ట్ హైప్డ్ వీడియోస్ లో ఒకటిగా వరుసగా 6 రోజులు ట్రెండింగ్ లో కొనసాగినట్టు మేకర్స్ రివీల్ చేశారు. దీనితో ఈ గ్లింప్స్ ఏ లెవెల్లో ఫ్యాన్స్ కి ఎక్కేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే పెద్ది సినిమాతో బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకున్న నిర్మాణ సంస్థ వృద్ది సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version