కొన్ని గంటల్లో యువ హీరో సినిమా ట్రైలర్ !

వేణు ఉడుగుల దర్శకత్వంలో శ్రీ విష్ణు , సాట్నా టైటస్ హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘నీది నాది ఒకే కథ’. మార్చి 23 న విడుదలకానున్న ఈ సినిమా ట్రైలర్ ను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే ట్రైలర్ చూసిన కొంతమంది బాగుందని చెప్పడం విశేషం.

సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాటలు బాగా పాపులర్ అయ్యాయి. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ఈ సినిమాకు నాగేశ్వర రెడ్డి బొంతల ఎడిటర్ గా పనిచెయ్యడం జరిగింది. అర్జున్ రెడ్డి కెమెరామెన్ రాజ్ తోట ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందించారు. ఈ సినిమాతో శ్రీవిష్ణు మరో సక్సెస్‌ సాధిస్తాడన్న నమ్మకంతో ఉన్నారు సినిమా యూనిట్.

Exit mobile version