గత కొంత కాలంగా ఎదురుచూస్తోన్న మాస్ రాజా – నేల టిక్కెట్టు టీజర్ వచ్చేసింది. రవి తేజ ఎనర్జీని ఇష్టపడే ప్రేక్షకులందరికి టీజర్ మంచికే కిక్ ఇచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా ‘చుట్టూ జనం మధ్యలో మనం’ అనే డైలాగ్ అందరిని ఆకట్టుకునే విధంగా. మాస్ రాజా మార్క్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఉన్నట్లు టీజర్ చెప్పకనే చెప్పింది. రవితేజ మాళవిక శర్మ జంట పై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం టీజర్ అభిమానులనే కాకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది.
సోగ్గాడే చిన్ని నాయన – రారండోయ్ వేడుక చూద్దాం వంటి వరుస హిట్స్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ నేల టిక్కెట్టు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారని చిత్ర యూనిట్ చెబుతోంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. జగపతి బాబు – పోసాని కృష్ణ మురళి అలాగే అలీ – ప్రియదర్శి వంటి నటీనటులు సినిమాలో కనిపించనున్నారు.
