ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డులు సెట్ చేసిన సినిమా బాహుబలి. మొత్తం రెండు భాగాలు కూడా సెన్సేషనల్ రికార్డులు సెట్ చేసి పూర్తిగా రూపు రేఖలు మార్చేసిన ఈ సినిమా రీరిలీజ్ లో కూడా ఆల్ టైం రికార్డ్ సెట్ చేయగా దీనిని ఓటీటీలో కూడా విడుదల చేసారు. బాహుబలి ది ఎపిక్ ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మరో సర్ప్రైజ్ ని నెట్ ఫ్లిక్స్ వారు కన్ఫర్మ్ చేసారు.
అతి త్వరలోనే బాహుబలి ది టార్చ్ బ్యారర్ అంటూ సరికొత్త వెర్షన్ ని సడెన్ గా అనౌన్స్ చేయడం వైరల్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ హోమ్ పేజీలో ఈ సరికొత్త బ్యానర్ కనిపించడంతో ఇదేంటి అనే సరికొత్త డిస్కషన్ మొదలైంది. మరి దీనిపై మేకర్స్ గాని నెట్ ఫ్లిక్స్ గాని ఇంకా ఇతర డీటెయిల్స్ అందించలేదు. సో అవేంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉన్నాయి. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అలాగే శోభు యార్లగడ్డ ఈ సినిమాని నిర్మాణం వహించారు.
Mahaa Sena… Open @Netflix.
— Baahubali (@BaahubaliMovie) June 21, 2026
