2026లో అదరగొట్టే తెలుగు సినిమాలను లైనప్ చేసిన నెట్‌ఫ్లిక్స్..!

Netflix

2026 సంవత్సరానికి సంబంధించిన తమిళ సినిమా లైన్‌అప్‌ను ఇప్పటికే ప్రకటించిన ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఇండియా, ఇప్పుడు ఈ క్యాలెండర్ ఇయర్‌కు గానూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాలను కూడా అధికారికంగా వెల్లడించింది. భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్లు, ఆసక్తికరమైన కథలతో రూపొందుతున్న చిత్రాలు ఇందులో చోటు దక్కించుకున్నాయి. ఈ సినిమాలన్నీ పలు భారతీయ భాషల్లో స్ట్రీమింగ్‌కు రానుండటం విశేషం. నెట్‌ఫ్లిక్స్ తాజాగా సొంతం చేసుకున్న టాలీవుడ్ సినిమాల జాబితా ఇలా ఉంది.

పెద్ది

నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్
దర్శకుడు: బుచ్చిబాబు సానా
భాషలు: తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం

ఉస్తాద్ భగత్ సింగ్

నటీనటులు: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా
దర్శకుడు: హరీష్ శంకర్
భాషలు: తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం

ది పారడైస్

నటీనటులు: నాని, మోహన్ బాబు, రాఘవ్ జుయాల్, కయాదు లోహర్
దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల
భాషలు: తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం

ఆదర్శ కుటుంబం AK47

నటీనటులు: వెంకటేష్, శ్రీనిధి శెట్టి
దర్శకుడు: త్రివిక్రమ్
భాషలు: తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం

బైకర్

నటీనటులు: శర్వానంద్, మాళవిక నాయర్
దర్శకుడు: అభిలాష్ రెడ్డి కంకర
భాషలు: తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం

VD14

నటీనటులు: విజయ్ దేవరకొండ
దర్శకుడు: రాహుల్ సంకృత్యాన్
భాషలు: తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం

ఫంకీ

నటీనటులు: విశ్వక్ సేన్, కయాదు లోహర్
దర్శకుడు: అనుదీప్ KV
భాషలు: తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం

ఛాంపియన్

నటీనటులు: రోషన్ మేకా, అనస్వర రాజన్
దర్శకుడు: ప్రదీప్ అద్వైతం
భాషలు: తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం

ఆకాశంలో ఒక తార

నటుడు: దుల్కర్ సల్మాన్
దర్శకుడు: పవన్ సాదినేని
భాషలు: తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్

నటుడు: ఫహాద్ ఫాజిల్
దర్శకుడు: శశాంక్ యేలేటి
భాషలు: తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం

418

నటి: ప్రీతి పగడాల
దర్శకుడు: కీర్తన్ నడగౌడ
భాషలు: తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం

రాకాస

నటీనటులు: తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, వెన్నెల కిషోర్
దర్శకురాలు: మానస శర్మ
భాషలు: తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం. 37

నటీనటులు: ప్రకటించలేదు
దర్శకుడు: కళ్యాణ్ శంకర్
భాషలు: తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం

ఈ చిత్రాలతో నెట్‌ఫ్లిక్స్ ఇండియా ప్రస్తుతానికి ప్రకటించిన తాజా టాలీవుడ్ అక్విజిషన్ల జాబితా పూర్తయింది. రాబోయే నెలల్లో మరిన్ని తెలుగు సినిమాలు నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో చేరనున్నాయని సమాచారం. దీంతో ఓటీటీ ప్రేక్షకులకు 2026 మరింత స్పెషల్‌గా మారనుంది.

Exit mobile version