ఆ హార్ట్ విన్నింగ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో

Care Of cancharapalem

గతఏడాది విడుదలైన కేరాఫ్ కంచరపాలెం చిత్రం విభిన్న చిత్రంగా పేరుతెచ్చుకుంది. జీవితంలో వివిధ దశలలో ఎదురైయ్యే ప్రేమకథలు, వాటి పర్యవసానాలు తెరపై దర్శకుడు సహజంగా తెరకెక్కించిన తీరుకి సినీ విమర్శకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ, దర్శకుడు మహా వెంకటేష్ కి, నిర్మాతలకు అలాగే నటులకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

కాగా ఈ చిత్రం ప్రముఖ డిజిటల్ మీడియా మాధ్యమం అయిన నెట్ ఫ్లిక్స్ నందు అందుబాటులోకి రానుంది. ఈనెల ఆరు నుండి నెట్ ఫ్లిక్స్ చందాదారులకి కంచరపాలెం మూవీ చూసే అవకాశం కలదు. చిన్న చిత్రం కావడం వలన ఈ చిత్రం ప్రేక్షకులకు చేరకుండానే థియేటర్ల నుండి వెళ్ళిపోయింది. మరి థియేటర్లో మిస్సయ్యామే అని బాధపడేవారు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూసి ఆనందించే అవకాశం దక్కింది.

Exit mobile version