“కూలి నెం 1″లో ఆ సీన్ పై ఓ రేంజ్ ట్రోలింగ్.!

coolie

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ మరియు సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం “కూలీ నెంబర్ 1”. 1995లో వచ్చిన కూలీ నెం 1 కు రీమేక్ గా దీనిని దర్శకుడు డేవిడ్ ధావన్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం లేటెస్ట్ గానే దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబడింది. ఇక ఈ సినిమా ఫలితాన్ని పక్కన పెడితే ఏ సీన్ కోసమే ఇప్పుడు సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.

ఇందులో రైల్వే స్టేషన్ దగ్గర ఓ బాబును కాపాడే సీన్ లో వరుణ్ ధావన్ బ్రిడ్జి పై నుంచి దూకేసి ట్రైన్ మీద నుంచి పరిగెత్తి వెళ్లి మరీ ట్రాక్ మీద ఉన్న బాబును కాపాడేస్తాడు. అయితే ఇది చూసాక మా మైండ్ బ్లాక్ అయ్యిందని సినిమా చూసిన వాళ్ళు అంటున్నారు. అంతే కాకుండా ఎప్పుడో ఇలాంటి ఓవర్ సీన్స్ చూసాం కానీ ఇది మాత్రం వేరే లెవెల్ అంటున్నారు. అలాగే దీనిపై గట్టిగానే ట్రోల్స్ పడుతున్నయి.

మొబైల్ గేమ్స్ లో కూడా ఈ రేంజ్ జంపింగులు లేవని, ఫిజిక్స్ కు రెస్ట్ ఇన్ పీస్ అని ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా అసలు ఆ ట్రైన్ మీదకు దూకి దాని కంటే ముందే వెళ్లి కాపాడేయడం ఏంటో ఈ 2020లలో కూడా ఈ సీన్స్ ఏంటో అని విస్తుపోతున్నారు. అలాగే హీరోపై డిజైన్ చేసిన ఈ సన్నివేశం కోసం ఏకంగా ఎలక్ట్రికల్ ట్రైన్ కు ఏకంగా వైర్లే పీకేశారని మరికొంతమంది లాజికల్ ట్రోల్స్ కూడా వేస్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ సన్నివేశం ఇండియా వైడ్ ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

Exit mobile version