సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. నటుడిగా మంచి పేరున్న సుశాంత్ సింగ్ అతి తక్కువ వయసులో మానసిక వేదనతో మరణించడం అందరిని కలచివేస్తుంది. ఐతే సుశాంత్ మరణానానికి పరోక్షంగా బాలీవుడ్ బడా దర్శక నిర్మాతలే కారణం అని చాల మంది ఆరోపిస్తున్నారు. ఎటువంటి సినిమా నేపథ్యం లేని కారణంగా సుశాంత్ కి సరైన ప్రోత్సాహం దక్కలేదని ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా హీరోయిన్ అలియా భట్, కరణ్ జోహార్ లను వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా కాఫీ విత్ కరణ్ టాక్ లో పాల్గొన్న అలియా సుశాంత్ పట్ల అవమానకర వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ సుశాంత్ ఎవరు.. నాకు తెలియదు అని ఆమె చెప్పగా దానికి కరణ్ కూడా ఎగతాళిగా నవ్వారు. సుశాంత్ మరణం తరువాత వీరు చేసిన ట్వీట్స్ పై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. అప్పుడు సుశాంత్ ని అవమానించిన వీరిద్దరూ ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అలాగే కరణ్, అలియా చిత్రాలను బాయ్ కాట్ చేస్తామని చెవుతున్నారు.
