బాలీవుడ్ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘రామాయణ’. దర్శకుడు నితీష్ తివారి, రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ల కలయికలో నిర్మాత నమిత్ మల్హోత్రా తెరకెక్కించిన భారీ చిత్రమే ఇది. అయితే ఈ సినిమాని మన చరిత్ర అంటూ బాగానే ప్రెజెంట్ చేస్తున్నారు. కానీ ఈ చరిత్రని చెప్పే క్రమంలో సినిమా మేకర్స్ బాగా మిస్టేక్స్ చేస్తున్నారనే విమర్శలు ఎప్పటికపుడు వినిపిస్తూనే వస్తున్నాయి.
సాయి పల్లవి, రణబీర్ కపూర్ ల విషయాల్లో దేశం, ఆహారపు అలవాట్లు పరంగా ఇలాంటి వారిని రాముడు, సీత పాత్రలకి ఎలా తీసుకుంటారనే దగ్గర నుంచి మొన్న ఫస్ట్ సింగిల్ లో రామాయణంలోకి కృష్ణ భగవానుని కోసం సాహిత్యం ఎలా వచ్చింది అనే వరకు మేకర్స్ తాలూకా భాద్యతా రాహిత్యాన్ని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నించారు. ఇక ఇదే ఫస్ట్ సింగిల్ విషయంలో సరికొత్త కాంట్రవర్సీ ఇపుడు వినిపిస్తుంది.
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద మొన్న వచ్చిన జై జై రామ్ సాంగ్ ని తమిళ్ లో ఆలపించినట్టుగా ఆమె సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. దీనితో చాలామందికి ఈ సినిమా కోసం ఆమె ఎంపిక తప్పు అని కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకి ఎంత శ్రావ్యమైన గొంతు ఉన్నప్పటికీ అసలు రాముడంటేనే గౌరవం లేని వారితో ఎలా పాట పాడించారు అని సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమె పాత ట్వీట్ తో రచ్చ చేస్తున్నారు.
ఇంతకీ అందులో ఏముందంటే “భర్తకు శ్రీరాముడు లేదా లక్ష్మణుడి కంటే చెడ్డ ఆదర్శం మరొకరు ఉండరు.” అంటూ చెప్పడం జరిగింది. దీనితో ఇలాంటి వారికి రామాయణ లాంటి సినిమాలో పాట పాడించడం ఏంటని నెటిజన్స్ మేకర్స్ ని ప్రశ్నిస్తున్నారు. దీనితో ఈ విషయమే ఇప్పుడు వైరల్ గా మారింది.
Ramayana team is doing everything to make the movie flop. https://t.co/wHGUhX2unG pic.twitter.com/AGcXr5hzE5
— Hindutva (@Hindutvaking_) September 26, 2026
असुरों को भी राम की शरण में आना पड़ता है 🤗 https://t.co/Sa13GisNMb pic.twitter.com/6Ae7mEKnhp
— Ankit Jain (@indiantweeter) September 26, 2026
There cannot be a worse example for a husband than Lord Rama or even Lakshman for that matter.
— Chinmayi Sripaada (@Chinmayi) January 26, 2010


