
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘రుద్రమదేవి 3డి’. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా స్టీరియో స్కోపిక్ మెథడ్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే గుణశేఖర్, అనుష్క, రానా, అల్లు అర్జున్ కి సంబందించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.
ఇప్పుడు 2015 న్యూ ఇయర్ కానుకగా రుద్రమదేవి రాయల్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో సుమారు 5 కోట్ల విలువ చేసే రియల్ జ్యువెలరీని వారి కొన్ని సీన్స్ ని అనుష్క పై షూట్ చేసారు. ఆ జ్యువెలరీతో ఉన్న రుద్రమదేవి రాయల్ లుక్ ని న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. రుద్రమదేవి రీగల్ లుక్ కి సంబందించిన జ్యువెలరీని ఎన్ఏసి వారు డిజైన్ చేసారు.
అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.