రామ్ చరణ్ మూవీ నుంచి అనిరుధ్ అవుట్, దేవీశ్రీ ఇన్.!

ram-charan-srinu-vaitla
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేయనున్న సినిమా మార్చి 16న సెట్స్ పైకి వెళ్ళింది. ఫస్ట్ షెడ్యూల్ రెండు రోజుల్లో ముగియగా, సెకండ్ షెడ్యూల్ ఏప్రిల్ సెకండ్ నుంచి మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొంటాడు. ఇది కాసేపు పక్కన పెడితే.. తమిళంలో ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేస్తున్న యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్(కొలవెరి డీ సాంగ్ ఫేం) ని ముందుగా ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు. కానీ తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్న ఖచ్చిత సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి అనిరుధ్ తప్పుకున్నాడని, అదే ప్లేస్ లో దేవీశ్రీ ప్రసాద్ వచ్చాడని అంటున్నారు.

ఇదే విషయాన్ని టాలీవుడ్ టాప్ పి.ఆర్.ఓ కూడా దాదాపు ఖరారు చేసారు. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అలాగే అనిరుధ్ చేత సైన్ చేయించాక అతన్ని కాదని దేవీశ్రీ ప్రసాద్ ని మార్చడం వెనకున్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ దేవీశ్రీ ప్రసాద్ ఖరారైతే, రామ్ చరణ్ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చే మొదటి సినిమా ఇదే అవుతుంది. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత. ఈ సినిమాని విజయదశమి కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version