జన నాయగన్ : అంచనాలు పెంచేస్తున్న కొత్త ప్రోమో..!

Jana Nayagan

తమిళనాడు సీఎం విజయ్ చివరి చిత్రంగా వస్తున్న ‘జన నాయగన్’ ఈ గురువారం థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ సినిమా ‘భగవంత్ కేసరి’ కి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమా తెలుగులో ‘జన నాయకుడు’ అనే టైటిల్‌తో విడుదల కాబోతోంది.

​ఈ చిత్ర విడుదల సందర్భంగా హీరో విజయ్ సోషల్ మీడియా ద్వారా సరికొత్త ప్రోమోను విడుదల చేశారు. అనిరుధ్ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ ప్రోమో సాలిడ్‌గా ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, శ్రీలీల పాత్రలో మమితా బైజు, విలన్‌గా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కనిపించనున్నారు.

Exit mobile version