
సౌత్ ఇండియన్ ఆల్ టైం సూపర్ స్టార్ రజినీకాంత్ తన తదుపరి సినిమాగా రియలిస్టిక్ స్టొరీతో చేయనున్న మాఫియా ఎంటర్టైనర్ ‘కబాలి'(తమిళ్ టైటిల్) సినిమా షూటింగ్ కోసం సిద్దమవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమాలో రజినీకాంత్ కనిపించనున్న స్పెషల్ లుక్ పై ఫోటోషూట్ ని కూడా నిర్వహించారు. కబాలి’ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 17 నుంచి మొదలు పెట్టడానికి అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. షూటింగ్ డేట్ లో పెద్ద చేంజ్ లేకపోయినా షూటింగ్ లొకేషన్స్ మాత్రం చేంజ్ చేసారని ఇది వరకే తెలియజేశాం. అదే మొదట చెన్నైలో షూట్ చేసి తర్వాత మలేషియా షెడ్యూల్ ని షూట్ చేయాలని నిర్ణయించారు.
కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలిసాయి. మలేషియాలో ఇండోర్ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేయాలిసిన సీన్స్ కోసం మలేషియా వెళ్ళకుండా ఆ ఎపిసోడ్స్ ని కూడా చెన్నైలోనే షూట్ చేసెయ్యాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఆదిత్యారామ్ స్టూడియోస్ లో ఓ పెద్ద సెట్ ని కూడా వేస్తున్నారు. ఇది కాకుండా ఫోటోషూట్ లో భాగంగా రజినీకాంత్ కి మలేషియా పోలీస్ డ్రెస్ లో కూడా స్టిల్స్ ని షూట్ చేసారు. దీని ప్రకారం మలేషియన్ పోలీస్ గెటప్ లో కూడా రజినీకాంత్ కనిపించనున్నాడని తెలుస్తోంది. సౌత్ చెన్నైలోని ఓ రియల్ లైఫ్ మాఫియా డాన్ పాత్రని స్పూర్తిగా తీసుకున్న ఈ సినిమాలో రజినీకాంత్ కబాలీశ్వరన్ అనే పాత్రలో కనిపించనున్నాడు.
రజినీకాంత్ సరసన రాధిక ఆప్టేని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ధన్సిక, కలైరాసన్, జెడి చక్రవర్తి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కలైపులి ఎస్ థాను నిర్మించనున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

