బాలయ్య కొత్త సినిమా పై కొత్త రూమర్ !

Balakrishna

బాలయ్య కొత్త సినిమాల పై ఇండస్ట్రీలో రోజుకొక రూమర్ వినిపిస్తోంది. తాజాగా రచయిత కోన వెంకట్ బాలయ్య కోసం ఓ కథను రాశాడని.. ఇప్పటికే బాలయ్యకి కథ కూడా వినిపించడం జరిగిందని.. కోన కథను బాలయ్య ఓకే చేసాడని సమాచారం. కథలో ఫుల్ యాక్షన్ తో కూడుకున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ ఎలిమెంట్స్ ఉన్నాయని.. అందుకే బాలయ్యకు కథ బాగా నచ్చిందట. అన్నట్టు ఈ సినిమాని డైరెక్టర్ వినాయక్ డైరెక్ట్ చేసే అవకాశం ఉంది.

అయితే 2022 ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లే ప్లాన్ లో ఉన్నారట టీమ్. బాలయ్యతో వినాయక్ సినిమా అంటూ గత రెండేళ్ళ నుండి టాక్ వినిపిస్తోంది. బాలయ్య కు పెద్ద హిట్ ఇవ్వాలనే కసితో వినాయక్ ఈ సినిమా చేస్తున్నాడట. మొత్తానికి బాలయ్య మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం బోయపాటి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Exit mobile version