ఫైట్ తో మొదలుకానున్న ‘అలిమేలు మంగ’ !

యాక్షన్ హీరో గోపీచంద్‌ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రూపొందనున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. ఫిబ్రవరి 7 నుండి రామోజీ ఫిల్నుంమ్డి సిటీలో వేసిన సెట్స్ లోనే ముందుగా గోపీచంద్ మీద ఓ ఫైట్ ను తీయబోతున్నారు. ఈ నెలతో గోపీచంద్ ప్రస్తుతం చేస్తోన్న సిటీమార్ పూర్తి అవుతుందని.. అందుకే ‘అలిమేలుమంగ వేంకటరమణ’ను స్టార్ట్ చేయాలని గోపీచంద్ సన్నాహాలు చేసుకుంటున్నాడట. ఇక తనకు నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టినా దర్శకుడు తేజతో గోపీచంద్ ‘ఒక హీరో’గా చేస్తోన్న మొదటి సినిమా ఇది.

కాగా తేజ, గోపీచంద్‌ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో రూపొందనున్న సినిమా కోసం తేజ ఓ వైవిధ్యమైన నేపథ్యంతో విభిన్నమైన కథని రాశాడట. అయితే ఇంతకీ అలిమేలు మంగ పాత్రలో ఎవరు నటిస్తున్నారు ? ఇప్పటికే హీరోయిన్ కోసం స్టార్ హీరోయిన్ల పేర్లని తేజ పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా అలిమేలు మంగగా కీర్తి సురేష్ ను తేజ ఫిక్స్ చేశాడని, సాయి పల్లవిని ఫిక్స్ చేశాడని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

Exit mobile version