ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి తన నెక్ట్స్ మూవీ మహేష్ బాబుతో చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో క్లారిటీ లేదు. ప్రసుతం మహేష్ పరుశురామ్ సినిమా చేస్తున్నాడు. పరశురామ్ కూడా ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్నాడని తెలుస్తుంది. అయితే పరుశరామ్ సినిమా తరువాత వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ పనిలో ఉన్నాడు.
కానీ అంతలో కరోనా వచ్చి సినిమాలన్నీ పోస్ట్ ఫోన్ అయిపోయాయి. దాంతో పరుశురామ్ సినిమా తరువాత రాజమౌళి సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని మహేష్ కొత్తగా ఆలోచిస్తున్నాడట. ఎలాగూ గ్యాప్ వచ్చింది కనుక మరి మహేష్ కొన్ని నెలలు వెయిట్ చేసి, పరుశురామ్ తో సినిమా తరువాత రాజమౌళితో సినిమాను స్టార్ట్ చేస్తాడేమో చూడాలి. ఏది ఏమైనా మహేష్ నుండి క్లారిటీ కావాలని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
