మోక్షజ్ఞ మొదటి సినిమా పరిస్థితేంటి ?

Mokshagna

నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా ‘ఆదిత్య 369’కి కొనసాగింపుగా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’తోనే మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం కానున్నాడని.. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. కానీ, ఈ సినిమా పై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయిందని.. ఏప్రిల్ లో ఈ సినిమా ఘాట్ స్టార్ట్ అవుతుందని కూడా వార్తలు వచ్చాయి.

మరి, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. కాగా ఈ సినిమాలో బలమైన క్యాస్టింగ్ కూడా ఉంటుందట. అలాగే, మోక్షజ్ఞ లుక్‌ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఆ మధ్య తన వారసుడి ఎంట్రీ పై బాలయ్య మాట్లాడుతూ.. ‘మోక్షజ్ఞను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలుసు. మోక్షజ్ఞ కోసం ఒక ఐదు ఆరు స్క్రిప్ట్స్ నా మైండ్ లోనే రెడీగా ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు.

Exit mobile version