తదుపరి లుక్ పేరు బయటపెట్టిన రాజమౌళి

prabas-shivudu
గత రెండున్నర సంవత్సరాలుగా బాహుబలిని చెక్కుతూనే వున్నా ఇప్పుడు తన సినిమా ప్రమోషన్ విషయంలో నూటికి నూటొక్క మార్కులు వేయించుకుంటున్నాడు రాజమౌళిఫస్ట్ లుక్ పోస్టర్ ల రిలీజ్ లతోనే సినిమాకు ఎనలేని క్రేజ్ ని సంతరించుకున్తున్నాడు. . సినిమాలో పాత్రలన్నిటినీ ఒక్కొక్కటిగా పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు.

నిన్న విడుదల చేసిన ప్రభాకర్(కాళకేయ) పోస్టర్ మంచి స్పందనని సంతరించుకున్న నేపధ్యంలో తరువాత విడుదల చేసే పాత్ర పేరు ట్విట్టర్ లో తెలిపాడు. తెలుగులో బిజ్జాలదేవ, తమిళంలో పింగళతేవన్ పేరుతొ తదుపరి పాత్ర వుండనుంది. అయితే ఈ పాత్రను ఎవరు పోషించారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఆర్కా మీడియా సంస్థ ద్వారా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శకుడు.

Exit mobile version