ప్రముఖ హాలీవుడ్ నటుడు నిక్కీ కేట్ ఇక లేరు. 54 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశారు. ఐతే, కేట్ మరణానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. నిక్కీ కేట్ మంచి నటుడు. 1980లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. డేజ్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్, అమెరికన్ యకుజా, ఫాంటమ్స్, ఇన్సోమేనియా, ది బేబీ సిట్టర్ తదితర 40 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. భాషలతో సంబంధం లేకుండా అన్ని రకాల సినీ అభిమానులను నిక్కీ కేట్ ఆకట్టుకున్నారు.
ఆయన భారతీయ సినీ అభిమానులకు కూడా సుపరిచితుడు. అన్నట్టు నిక్కీ 40 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అలాగే దాదాపు 30 టీవీ సిరీస్‌లలోనూ నటించారు. హాలీవుడ్లో కల్ట్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు, సినీ అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. మా 123తెలుగు.కామ్ తరఫున నిక్కీ కేట్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
