పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు ప్రధాని అవుతారు – రాజాసాబ్ హీరోయిన్ జోస్యం

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్‌గా బిజీగా ఉన్నారు. ఆయన నుంచి నెక్స్ట్ రాబోయే సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో పవన్-హరీష్ కాంబో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ పై ‘ది రాజా సాబ్’ హీరోయిన్ నిధి అగర్వాల్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ తాను పవన్ కళ్యాణ్ లాంటి ధైర్యం ఉన్న వ్యక్తిని చూడలేదని.. ఆయన చుట్టూ ఓ ఆరా ఉంటుందని.. ఆయన్ను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు దేవుడిలా చూస్తారని చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ స్థాయికి హిట్, ఫ్లాప్ ఎలాంటి ప్రభావం చూపదని ఆమె పేర్కొంది. ఏదో ఒక రోజు ఆయన ఖచ్చితంగా దేశ ప్రధాని అవుతారని నిధి జోస్యం చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం నిధి అగర్వాల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక పవన్‌తో కలిసి ఆమె ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Exit mobile version