నిధి అగర్వాల్ గాలిలో తేలిపోతోంది

Nidhhi Agerwal2
నిధి అగర్వాల్ కు ఎట్టకేలకు భారీ అఫర్ తగిలింది. అది కూడ పవన్ కళ్యాణ్ సినిమాతో కావడం విశేషం. కెరీర్ ఆరంభంలో నాగ చైతన్య, అఖిల్ లాంటి హీరోలతో చేసి మధ్యలో ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి భారీ హిట్ అందుకున్న నిధి తమిళంలో కూడ అదృష్టం పరీక్షించుకుంటోంది. ఇలాంటి టైంలోనే ఆమెను పవన్ ‘హరి హర వీరమల్లు’ ఆఫర్ వరించింది. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చేయడం పట్ల నిధి చాలా ఎగ్జైట్ అవుతోంది. కెరీర్ కుదురుకోవడానికి, కమర్షియల్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకోవడానికి ఇదే గొప్ప అవకాశమని భావిస్తోంది ఆమె.

పవన్ సినిమాలో వర్క్ చేయడం ఒక గొప్ప అనుభూతి అంటున్న ఆమె తనను ఏ సినిమాలోనూ చూపించనంత అందంగా ఈ సినిమాలో చూపిస్తున్నారని, ఈ క్రెడిట్ అంతా దర్శకుడు క్రిష్ కే దక్కుతుందని, తనను ఏ విధంగా ప్రెజెంట్ చేశారో చూపించడానికి చాలా ఆతురతగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఈ చిత్రం గనుక హిట్టయితే నిధి స్టార్ తిరిగినట్టే. ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ పిరియాడికల్ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇంకొన్ని భారతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. పవన్ కెరీర్లో ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా.

Exit mobile version