మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పలువురు హీరోలు తెలుగు తెరకు హీరోలుగా పరిచయం అయ్యారు. మొదటిసారి మెగా ఫ్యామిలీ నుంచి ఓ హీరోయిన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తనే నాగబాబు తనయురాలు నిహారిక కొణిదెల. ప్రముఖ న్యూస్ ఛానల్ TV9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ నిర్మాతగా ఓ సినిమాని తెరకెక్కించనున్నారు. “మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు” వంటి మంచి ప్రేమ కథా చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రామరాజు ఈ సినిమాకి దర్శకుడు.
యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించనున్న ఈ సినిమాతో నిహారిక హీరోయిన్ గా పరిచయం కానుంది. ఈ సినిమాని కేవలం తెలుగులోనే కాకుండా ఒకేసారి తమిళంలో కూడా షూట్ చేసి ద్విభాషా చిత్రంగా ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర టీం నిర్ణయించింది. అనగా ఒక్క సినిమాతో నిహారిక రెండు ఇండస్ట్రీలలో పరిచయం కానుంది. ఈ చిత్రానికి A. అభినయ్, డా. కృష్ణ భట్ట సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేస్తారు.
