
వరుసపెట్టి విజయాలతో దూసుకుపోతున్న నిఖిల్ తన తాజా చిత్రం కోనా వెంకట్ నిర్మాణంలో నటించనున్నాడు. ‘శంకరాభరణం’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి హీరోయిన్ గా నందితని ఎంపిక చేసుకున్నారు.
క్రైమ్ కామెడీ నేపధ్యంలో సాగే ఈ సినిమా బిహార్ తదితర ప్రాంతాలలో తెరకెక్కించనున్నారు. ఉదయ్ నందనవనం దర్శకుడు. జూన్ 15నుండి షూటింగ్ ప్రారంభంకానుంది.

