
బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్ సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్. సినిమా సినిమాలోనూ వైవిధ్యం చూపిస్తూ తను చేసిన స్వామి రారా, కార్తికేయ, సూర్య vs సూర్య సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అదే బాటలోనే ఇప్పుడు నిఖిల్ చేస్తున్న క్రైమ్ కామెడీ మూవీ ‘శంకరాభరణం’. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది సెట్స్ పై ఉండగానే నిఖిల్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
మాకు అందిన న్యూస్ ప్రకారం సందీప్ కిషన్ – రాహుల్ రవీంద్రన్ కలిసి నటించిన ‘టైగర్’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన డైరెక్టర్ విఐ ఆనంద్. తాజాగా విఐ ఆనంద్ చెప్పిన ‘థ్రిల్లింగ్ లవ్ స్టొరీ’ నిఖిల్ కి బాగా నచ్చడంతో వెంటనే ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది. నిఖిల్ ఈ సినిమాలో కూడా సరికొత్తగా కనిపించి ఆడియన్స్ ని మెప్పించనున్నాడని సమాచారం. మొదటి సినిమాకి ఓ మంచి ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ స్టొరీ ని రాసుకున్న విఐ ఆనంద్ తన సెకండ్ సినిమా కోసం థ్రిల్లింగ్ కథని సిద్దం చేసాడట.

