వరల్డ్ వైడ్ అదిరే ఓపెనింగ్స్ అందుకున్న “స్పై”.!

SPY

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా దర్శకుడు గ్యారీ బి హెచ్ తెరకెక్కించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా “స్పై”. అయితే కాస్త మిక్సిడ్ రెస్పాన్స్ నే అందుకున్న ఈ చిత్రం యూఎస్ లో సాలిడ్ వసూళ్లు రాబడుతుంది. ఇక తెలుగు స్టేట్స్ కూడా మంచి ఆక్యుపెన్సీ ని కనబరిచిన ఈ చిత్రం దీనితో వరల్డ్ వైడ్ గా అయితే సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకుంది.

మరి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 11.7 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. మరి ఇది నిఖిల్ కెరీర్ లోనే అత్యధికం అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే లాస్ట్ మినిట్ లో కూడా నిఖిల్ సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకున్నాడు. ఇక ఈ వారాంతంలో వసూళ్లు వస్తాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ మరియు శ్రీచరణ్ పాకల సంగీతం అందించగా ఈడీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version