‘సూర్య v/s సూర్య’ చిత్రీకరణలో బిజీగా నిఖిల్.

nikhil
‘కార్తికేయ’ సినిమా విజయంతో చాలా సంతోషంగా ఉన్న యంగ్ హీరో నిఖిల్, నేటి నుండి తన కొత్త సినిమా ‘సూర్య vs సూర్య’ తాజా షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించాడు. ‘కార్తికేయ’ సినిమాకు విమర్శకుల ప్రసంశలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా లభించింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ సక్సెస్ టూర్స్ వేశాడు. ఇప్పుడు తిరిగి షూటింగ్ తో బిజీ అయిపోయాడు.

‘హ్యాపీ డేస్’ తర్వాత మరోసారి నిఖిల్ కాలేజ్ నేపధ్యంలో చేస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సూర్య vs సూర్య’. ఈ సినిమాతో ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘కార్తికేయ’ సినిమాల సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. తనికెళ్ళ భరణి, సత్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్ ను ఇంకా సెలెక్ట్ చేయలేదు. సురక్షా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version