
‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ చిత్ర విజయాల తర్వాత కథల ఎంపికలో యువ హీరో నిఖిల్ జాగ్రత్త వహిస్తున్నారు. వైవిధ్యమైన కథలతో (డిఫరెంట్ కాన్సెప్ట్) తెరకెక్కిన చిత్రాలు కమర్షియల్ సక్సెస్ సాధించడం చాలా అరుదు. నా గత రెండు చిత్రాలు ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. ఇకపై, కథల ఎంపికలో కొంచం జాగ్రత్త వహిస్తాను అని నిఖిల్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం నేను నటిస్తున్న ‘సూర్య vs సూర్య’ రొమాంటిక్ కామెడీ జోనర్ సినిమా. తెలుగులో గతంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమాలకంటే కాస్త భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. నేను ఈ తరహా సినిమా చేయడం ఇదే మొదటిసారి. షూటింగ్ చివరిదశకు చేరుకుంది. క్లైమాక్స్ మాత్రమే చిత్రీకరించాలి. ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అని నిఖిల్ తెలిపారు.